Home > తెలంగాణ > Vijayashanthi:'దుర్మార్గం... దురంహంకారం...' కేటీఆర్‌పై విజయశాంతి ఫైర్

Vijayashanthi:'దుర్మార్గం... దురంహంకారం...' కేటీఆర్‌పై విజయశాంతి ఫైర్

Vijayashanthi:దుర్మార్గం... దురంహంకారం... కేటీఆర్‌పై విజయశాంతి ఫైర్
X

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘దళితులకు 3 ఎకరాలు, దళితబంధు, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇంకా ఎన్నో లెక్కకు చెప్పలేనన్ని మోసపు హామీలతో 10 ఏండ్లు ప్రజలను మోసగించిన బీఆర్ఎస్ గత సర్కారు, ఇయ్యాల ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏండ్ల కన్నా నిలవదు అని మాట్లాడటం కేవలం దుర్మార్గం.. దురహంకారం. ప్రజలెందుకు అసలు తిరుగుబాటు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ గారు? సమాధానం చెప్పడం మీ బాధ్యత.’ అని ట్వీట్ చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఎరువుల కోసం లైన్లో నిలబడటం, వాటిని పోలీస్ట్‌ స్టేషన్లలో పెట్టి పంపిణీ చేసే పరిస్థితులు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం ఆరునెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మండిపడ్డారు.

అయితే, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల దాడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏకంగా కేసీఆర్ ను టార్గె్ట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పులి బయటకు వస్తుంది అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పులిని బోనులో కట్టేసి వేలాడదీస్తామని వార్నింగ్ ఇవ్వడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Updated : 23 Jan 2024 10:09 AM IST
Tags:    
Next Story
Share it
Top