Home > తెలంగాణ > పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో ఉంటా : విష్ణు

పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో ఉంటా : విష్ణు

పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో ఉంటా : విష్ణు
X

రెండో జాబితా ప్రకటనతో తెలంగాణలో కాంగ్రెస్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. 45మందితో సెకండ్ లిస్ట్ విడుదలవ్వగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది తమ అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం ఆ స్థానం నుంచి అజారుద్దీన్ను బరిలోకి దింపింది. అయితే ఈ అంశంపై విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉంటానని విష్ణు ప్రకటించారు. టికెట్ వస్తుందని చివరి వరకు ఆశించానని.. కానీ ఢిల్లీ వెళ్లి దండాలు పెట్టినవాళ్లకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఒకే ఇంట్లో చాలామందికి టికెట్లు ఇచ్చారని.. మరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిటీలో కాంగ్రెస్కు ఒకే సీటు వస్తుందని సర్వేలు చెప్పాయని.. ఇప్పుడు ఆ సీటు కూడా పోయిందన్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలని అనుకోవడం లేదని.. కానీ అధిష్టానం తనతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. కాగా విష్ణు సోదరి విజయారెడ్డికి కాంగ్రెస్ ఖైరతాబాద్ టికెట్ ఇచ్చింది.

Updated : 28 Oct 2023 11:57 AM IST
Tags:    
Next Story
Share it
Top