Home > తెలంగాణ > ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బిజీ.. పార్టీలోకి భారీ చేరికలు

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బిజీ.. పార్టీలోకి భారీ చేరికలు

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బిజీ.. పార్టీలోకి భారీ చేరికలు
X

తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. పెద్ద సంఖ్యలో నేతలకు పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. కాగా, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ (జూన్ 26)న రాహుల్ గాంధి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీనికోసం ఈ ఇద్దరు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పొంగులేటి, జూపల్లితో పాటు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నట్లు సమాచారం.

ఈ సమావేశం తర్వాత జూపల్లి, పొంగులేటితో పాటు. అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేత్ భేటీ అవుతారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ అధిస్టానం నుంచి ఫోన్ రావడంతో ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిందని పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం లేదు. ప్రజలు అభిప్రాయం మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరారని అన్నారు.


Updated : 26 Jun 2023 4:47 PM IST
Tags:    
Next Story
Share it
Top