Telangana Assembly Elections: బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
X
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంతో కాలం నుంచి నాగంతో తనకు మంచి అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు. పార్టీలోకి రావాలని కోరడంతో ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చారని చెప్పారు. నాగం చేరికతో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలంగా తయారైందని.. ఈ సారి 14సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు భవిష్యత్కు తనది భరోసా అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన భవిష్యత్పై కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సామాన్య ప్రజల కోసం పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని.. ఆయన కొడుక్కి తమ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. విష్ణు సహా ఆయన అనుచరులను కలుపుకొని ముందుకు సాగాలని మాగంటి గోపినాథ్కు కేసీఆర్ సూచించారు. ఇక తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని.. మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.