CONGRESS MANIFESTO: కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. విద్యార్థులే టార్గెట్
X
ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధం అవుతుంది. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో, రాహుల్ గాంధీ సమక్షంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మరికొన్ని హామీలు రెడీ చేస్తూ.. ఎన్నికల మ్యానిఫెస్టో రెడీ చేస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాలకు అప్లై చేయాలంటే.. భారీగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దాని భారీగా తగ్గించి నామమాత్రంగా రూ.5 నుంచి రూ.10 పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు.
విద్యార్థులు, యువకులు, ప్రజల సంక్షేమానికి ఎలాంటిం హామీలు ఇవ్వాలనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఇందులో భాగంగానే ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించనున్నారు. పారా మిలటరీ, సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగుల కోసం కూడా కృషి చేయాలని నిర్ణయించారు. కళాశాల విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కూడా కాంగ్రెస్ ముఖ్య హామీల్లో ఒకటిగా ఉండనుంది. హామీలపై కసరత్తులు చేస్తూ.. ప్రజలకు ఎలాంటి హామీలు కావాలో తెలుసుకునేందుకు అక్టోబర్ 2న ఉదయం ఆదిలాబాద్ లో, సాయంత్రం నిజామాబాద్ లో పర్యటించనున్నారు.