MP Election : లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా.. స్పష్టం చేసిన జన్ మత్ సర్వే..
X
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో జోరు మీదున్న హస్తం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రస్తుతం గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్ ఈసారి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేసింది.
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగుతుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా జన్ మత్ పోల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తేలింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు గెలుచుకోనుండగా.. బీఆర్ఎస్ 4 నుంచి 5, బీజేపీ 2 నుంచి 3, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశముందని సర్వేలో స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జన్ మత్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతుందని ఆ సర్వే ముందుగానే అంచనా వేసింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లోనూ జన్ మత్ అంచనాలపై ఆసక్తి నెలకొంది.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎలక్షన్లకు సంబంధించి కూడా జన్ మత్ సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేసింది. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో వైసీపీ 111 నుంచి 113 స్థానాల్లో పాగా వేసి మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని అంచనా వేసింది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి 52 నుంచి 54 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని జన్ మత్ అంచనా వేసింది. ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 17 నుంచి 19 చోట్ల విజయం సాధిస్తుందని, టీడీపీ 4 నుంచి 5 సీట్లకే పరిమితమవుతుందని చెప్పింది.
Loksabha election 2024#Telangana state
— Janmat polls (@Janmatpolls) January 22, 2024
Congress =07-09
BRS =04-05
BJP =02-03
Other=01