హరీశ్ రావు పదే పదే అబద్దాలు చెప్తున్నారు
X
శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్, పొన్నం, జూపల్లి, కొండా సురేఖ తదితరులు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మోటర్లకు మీటర్ల విషయంపై మాజీ సీఎం కేసీఆర్ లాగే ఇప్పుడు హరీశ్ రావు కేంద్రంపై మళ్లీ అవే అబద్దాలు చెప్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ బిల్లులు కట్టమని కేంద్రం ఏనాడూ చెప్పలేదని అన్నారు. మరోవైపు కార్పొరేషన్ రుణాలపై హరీశ్ అబద్దాలు చెప్పారని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం భవనాలను కూల్చి మళ్లీ కట్టి నిధులన్నీ వృథా చేసిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సెక్రటేరియట్ బిల్డింగులు కూల్చి కొత్త భవనం కట్టారని కానీ పేదలకు అవసరమైన డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రం కట్టలేదని మండిపడ్డారు. మంత్రుల అభ్యంతరాలపై స్పందించిన హరీశ్ రావు తన ప్రసంగానికి వారు పదేపదే అడ్డుతగులుతున్నారని అలాంటప్పుడు వివరణ ఎలా ఇవ్వగలగుతానని అన్నారు.