మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక ఇది 6 వ సారి
X
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. సీఎం రేవంత్ సహ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరికొంతమంది మంత్రులు సహా లోక్‌సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్చార్జులు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్, భట్టి పాల్గొనున్నారు. అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి మున్షీ, పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లుగా మంత్రులు పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్దిశానిర్దేశం చేయనుంది.
లోక్‌సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే సునీల్ కనుగోలు టీం సర్వేలు చేస్తోంది. కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 15న సీఎం అమెరికా (దావోస్) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.