Home > తెలంగాణ > కాంగ్రెస్ తలుచుకుంటే 24గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ - కోమటిరెడ్డి రాజగోపాల్

కాంగ్రెస్ తలుచుకుంటే 24గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ - కోమటిరెడ్డి రాజగోపాల్

కాంగ్రెస్ తలుచుకుంటే 24గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ - కోమటిరెడ్డి రాజగోపాల్
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలో లేక ఏడాదో ఉంటుందన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే 24 గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రమే మిగులుతారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని రాజగోపాల్ అన్నారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతతా కాంగ్రెస్ లో చేరుతారని అన్నారు. కానీ తాము అలాంటి దుర్మార్గపు ఆలోచన చేయమని అన్నారు. ఎవరైనా ఇతర పార్టీల గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరాలనుకుంటే వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం, సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ స్పష్టం చేశారు. గతంలో తమ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏం చేసిందో అంతా చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

Updated : 7 Dec 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top