సభలో ఏం జరుగుతుందో తెలియడం లేదు : సీతక్క
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. అసలు సభలో ఏం జరుగుతుందో తెలియడం లేదని సీతక్క అన్నారు. జీరో అవర్లో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వడ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతసేపు మాట్లాడిన మైక్ కట్ చేయడం లేదని.. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం మాట్లాడగానే మైక్ కట్ చేస్తున్నారని చెప్పారు.
సమస్యలను అసెంబ్లీలోకి తీసుకరావొద్దని ప్రభుత్వం భావిస్తోందని సీతక్క ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ శాసనసభను వాడుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యలే లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్ లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు ఎందుకున్నాయని అడిగారు.