Home > తెలంగాణ > Vamshi Chand Reddy : కేసీఆర్కు దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలి : వంశీ చంద్ రెడ్డి

Vamshi Chand Reddy : కేసీఆర్కు దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలి : వంశీ చంద్ రెడ్డి

Vamshi Chand Reddy  : కేసీఆర్కు దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలి : వంశీ చంద్ రెడ్డి
X

కేసీఆర్కు దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షకులు ఎవరో ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారన్నారు. మహబూబ్ నగర్ ఓటర్లను తీర్పును రెఫరెండంగా భావిద్దామని చెప్పారు. కేసీఆర్ దుర్మార్గాలను, నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వదులుకొని ఏపీ జలదోపిడీకి కేసీఆర్ కాపలా కాశారని ఆరోపించారు.

కేసీఆర్ సంతకం..

కృష్ణా జలాలపై హక్కులను తన చేతగానితనంతో వదులుకొని తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్ది అని వంశీ చంద్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన శాశ్వత అన్యాయంపై ఆయన బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సింది 575 టీఎంసీలు అయితే.. కేసీఆర్ 299 టీఎంసీలకే కేంద్రం వద్ద ఒప్పుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గించుకుంటూ 2016 జూన్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకం పెట్టి.. తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాశారని విమర్శించారు.

అన్నీ ఆధారాలున్నాయి..

కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు 2022 మే 27న, మళ్లీ 2023 మే 19న కేసీఆర్ అంగీకారం తెలిపారని.. దీనికి ఆధారాలు సైతం ఉన్నాయని వంశీ చంద్ ఆరోపించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా తెలంగాణకు దక్కే అవకాశం ఉండేదన్నారు. కానీ అలా చేయకుండా రాష్ట్రాన్ని బీడు చేసిన చరిత్ర కేసీఆర్ది అని ఆరోపించారు. కమీషన్ల కోస కాళేశ్వరం పేరుతో నకిలీ కట్టడాలు చూపించి కేసీఆర్ వేల కోట్లు లూటీ చేశారన్నారు.

పాలమూరుకు కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేస్తోందని వంశీ చంద్ చెప్పారు. పాలమూరుకు చేసిన అన్యాయంపైన కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. సంగం బండ రిజర్వాయర్లో బండ పగలగొడితే 20 వేల ఎకరాలకు నీరు అందుతుందని మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. సంగం బండ బాధితులకు న్యాయం చేస్తూ వెంటనే నిధుల విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


Updated : 29 Feb 2024 7:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top