Home > తెలంగాణ > బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
X

హుజూర్ నగర్లో 50వేల మెజారిటీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మట్టంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ఈసారి 70సీట్లతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఉత్తమ్ కుమార్ తేల్చి చెప్పారు.

భూ కజ్బాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యే సైదిరెడ్డికి సాగర్ జలాలను తీసుకొచ్చే సమర్థత కూడా లేదని ఉత్తమ్ విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఆయన సొంత మండలంలో దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. రైతు బంధు ఆపమని చెప్పానని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. డిసెంబర్ మొదటివారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుందని.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని అన్నారు. మహిళలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. పెన్షన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచడంతో పాటు విద్యా భరోసా పథకం కింద స్టూడెంట్స్ కు రూ.5లక్షలు ఇవ్వనున్నా చెప్పారు.


Updated : 6 Nov 2023 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top