Home > తెలంగాణ > ఘనంగా సోనియా 77 పుట్టినరోజు వేడుకలు.. రేపు గాంధీ భవన్లో

ఘనంగా సోనియా 77 పుట్టినరోజు వేడుకలు.. రేపు గాంధీ భవన్లో

ఘనంగా సోనియా 77 పుట్టినరోజు వేడుకలు.. రేపు గాంధీ భవన్లో
X

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 77 పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియంలో సంబరాలు జరపనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రుల ఎంపిక, వారి శాఖల ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై నమ్మకముంచి తీర్పిచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు బాధలు పడ్డారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందన్నారు.

రేపు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 77 కిలోల కేక్ ను కట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుక గాంధీ భవన్ లో ఉంటుందని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పార్టీ పరంగా ఎంతో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ జిల్లాలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను జరపాలని పిలుపునిచ్చారు. కాగా ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసిన రేవంత్ అసెంబ్లీలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌ గాంధీలతో.. మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆయన చర్చించనున్నారు. గురువారం రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రేపు సోనియా గాంధీ పుట్టిన రోజున 64 ఎమ్మెల్యేల ప్రమాణి స్వీకారం, 11 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతుంది. దీంతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఆ ఆరుగురు మంత్రులు ఎవరవుతారనేనది ఆసక్తికరంగా మారింది.

Updated : 8 Dec 2023 2:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top