ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది - కవిత
X
గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలబడితే వాళ్లు మాత్రం ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బోధన్కు చుట్టపుచూపులా వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తారని, అక్కడ బిర్యానీ, పాన్ తిని ఢిల్లీ వెళ్లిపోతారని సటైర్ వేశారు. వందలాది మంది యువతను బలితీసుకున్న పాపం కాంగ్రెస్ పార్టీదని కవిత ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తేదని కర్ఫ్యూలు, మతకల్లోలాలతో జనం ఇబ్బందిపడేవారని కవిత అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో గత పదేండ్లలో ఒక్కసారి కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారమిస్తే రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని కవిత హామీ ఇచ్చారు. మంచివాళ్లను ఎంచుకుంటారో లేక ముంచేవాళ్లను ఎన్నుకుంటారో ప్రజలే ఆలోచించాలని కవిత సూచించారు.