చెప్పు చూపిస్తూ శ్రీనివాస్ రెడ్డిపై ఫైర్ అయిన సుజాత
X
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిపై.. ఆ స్థానం నుంచి టిక్కెట్ ఆశించి భంగపడి, రాజీనామా చేసిన సుజాత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమను కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది నిజమని నిరూపిస్తే.. చర్చకు ప్లేస్ టైమ్ డిసైడ్ చేయి అంటూ సవాల్ చేశారు. ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మాట్లాడితే ఉరుకోమని.. చెప్పు దెబ్బలు తింటావ్ అంటూ చెప్పు చూపించారు. స్త్రీలను కించ పరిచిన కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని.. ఇలాంటి నాయకుల్ని నిలదీయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజల పక్షాన పోరాటం చేసింది మేము తాము అని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. అస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేశామని ఆమె అన్నారు. ప్రజా సేవ అంటే ఏది అశించకుండా చేసేదని.. కానీ నీ ప్రజా సేవ కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నా.. రేవంత్ రెడ్డిని కొనుకున్నా అనే విధంగా ఉందని ఆమె మండిపడ్డారు. తమ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.