కాళేశ్వరం పై కాంగ్రెస్ దుష్రచారం.. బాల్క సుమన్ కామెంట్స్
X
బీఆర్‌ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్రచారలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీని బాగు చేసే ఉద్దేశం రేవంత్ ప్రభుత్వానికి లేదని..కాబట్టి శ్వేత పత్రాలతో డ్రామాలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురదజల్లి రానున్న ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. బ్యారేజీకి ఏమైనా అయితే ఆ నిందను గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల అమలును పక్కన పెట్టి.. కాంగ్రెస్ శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక.. లోక్ సభ ఎన్నికలు త్వరగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని ఆరోపించారు. అసలు సీఎం వ్యవహార శైలీ ఎవరికి అర్థం కావడం లేదన్నారు. కాగా, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలని సుమన్‌కు పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.