Bandla Ganesh : కాంగ్రెస్కు 90సీట్లు.. ఆయనే సీఎం : బండ్ల గణేష్
X
కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. నిన్నటి వరకు 76 నుంచి 85సీట్లు అనుకున్నా కానీ ఇప్పుడు 90 సీట్లు వస్తాయనే ధీమా వచ్చిందన్నారు. ఈ 10ఏళ్లు ఎంతో బాధను అనుభవించానన్న బండ్ల.. ఆదివారం నుంచి దీపావళి, దసరా పండగుల చేసుకుంటానని చెప్పారు. వచ్చే 10ఏళ్లు కాంగ్రెస్ అద్భుతంగా పాలించాలని దేవుడిని కోరకుంటున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7నుంచే ఎల్బీ నగర్ స్టేడియంలో పడుకుంటానని మరోసారి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్న దానిపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందని.. రేవంత్ రెడ్డి సీఎం అవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ ప్రాణం పెట్టి కొట్లాడారని అన్నారు. సీనియర్లు కూడా మంచి నాయకులే కానీ రేవంత్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాం.. అందుకే ఆయనే సీఎం అవుతారని తనకు నమ్మకం ఉందన్నారు. తమ పార్టీ అభ్యర్థులు చేజారరు.. కాలు జారరు అని చమత్కరించారు. ఇక తనకు పదవులపై ఆశ లేదని.. కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటానని స్పష్టం చేశారు. కాగా ఇవాళ ఉదయం రేవంత్ ను బండ్ల గణేష్ కలిశారు.