Home > తెలంగాణ > బీఆర్ఎస్ కోసం బీజేపీ పోటీలో లేకుండా పోయింది : ఖర్గే

బీఆర్ఎస్ కోసం బీజేపీ పోటీలో లేకుండా పోయింది : ఖర్గే

బీఆర్ఎస్ కోసం బీజేపీ పోటీలో లేకుండా పోయింది : ఖర్గే
X

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం బీజేపీ పోటీలో లేకుండా పోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని.. అందుకే బీజేపీ ఈ ఎన్నికలను లైట్ తీసుకుందని అన్నారు. కుత్బుల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ఒక్క కుటుంబం కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఇచ్చారని చెప్పారు. కానీ కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు కల్లలు అయ్యాయని అన్నారు.

కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే మోదీకి కన్పించడం లేదా అని ఖర్గే ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిని గురించి తెలిసినా మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మోదీ తెచ్చిన ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కర్నాటకలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు కాంగ్రెస్కు ఓటమి ఉండదన్నారు. .


Updated : 17 Nov 2023 4:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top