Home > తెలంగాణ > బీఆర్ఎస్ సర్కార్ 3లక్షల 66వేల కోట్ల అప్పులు చేసింది : ఖర్గే

బీఆర్ఎస్ సర్కార్ 3లక్షల 66వేల కోట్ల అప్పులు చేసింది : ఖర్గే

బీఆర్ఎస్ సర్కార్ 3లక్షల 66వేల కోట్ల అప్పులు చేసింది : ఖర్గే
X

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు భరోసా గ్యారెంటీ స్కీంను ప్రకటించారు. ఈ స్కీంలో భాగంగా రైతులకు 15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు 120 వేల సాయం అందిస్తామని చెప్పారు. వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు.

అధికారం కోసం మేం తెలంగాణ ఏర్పాటు చేయలేదని ఖర్గే చెప్పారు. రాజకీయంగా నష్టపోయినా.. తెలంగాణ బిడ్డల త్యాగాలను చూసి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో దోపిడి జరుగుతున్నదని.. రాష్ట్రాన్ని అప్పులదిబ్బగా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3లక్షల 66వేల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని ఖర్గే ఆరోపించారు. పైకి వేరుగా కన్పించినా.. లోపల వారంతా ఒకటే అని అన్నారు.

మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలు పేదలను పట్టిపీడిస్తున్నారని ఖర్గే ఫైర్ అయ్యారు. గొప్పొళ్లు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని పారిపోయారని.. అలాంటి వాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ పురోగతి సాధించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. కాంగ్రెస్ తోనే ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు.


Updated : 17 Sept 2023 7:22 PM IST
Tags:    
Next Story
Share it
Top