Home > తెలంగాణ > కాంగ్రెస్ చర్చలు సఫలం.. నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్స్

కాంగ్రెస్ చర్చలు సఫలం.. నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్స్

కాంగ్రెస్ చర్చలు సఫలం.. నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్స్
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అటు ప్రచారంలోనూ ఆ పార్టీ దూసుకెళ్తోంది. అయితే రెబల్స్ ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. పలు స్థానాల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా రెబల్స్గా ఎన్నికల బరిలో నిలిచారు. ఇవాళ నామినేషన్ల విత్ డ్రాకు చివరి రోజు కావడంతో ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.

రెబల్స్తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వారంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ వెస్ట్లో జంగా రాఘవ రెడ్డి, బాన్సువాడలో కాసుల బాలరాజు, జుక్కల్లో గంగారాం, డోర్నకల్లో నెహ్రూ నాయక్, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, పినపాకలో విజయ్ గాంధీ, వైరాలో రామ్మూర్తి నాయక్ సహా పలువురు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. వారంతా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు.

తొలుత నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు పటేల్ రమేష్ రెడ్డి ససేమీరా అన్నారు. అవసరమైతే దామోదర్ రెడ్డిని విత్ డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఏఐసీసీ దూతలు మల్లు రవి, రోహిత్ చౌదరీ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన పోటీ నుంచి వెనక్కి తగ్గారు. పార్టీ శ్రేయస్సు కోసం నామినేషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

Updated : 15 Nov 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top