Home > తెలంగాణ > కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అప్పుడే?

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అప్పుడే?

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అప్పుడే?
X

కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధం అయింది. నియోజక వర్గాల వారిగా అభ్యర్థలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. సోమవారం (ఆగస్టు 14) సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ లో ఈ సమావేశం జరుగగా.. ఇందులో టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధర్, మహేష్ కుమార్ గౌడ్, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పీసీసీకి టికెట్ కోసం ఇప్పటికే భారీగా దరఖాస్తులు రాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ భేటీ సమావేశం అవుతున్నట్లు తెలిపింది. ఈ అనంతరం సీఈసీకి కాంగ్రెస్ తొలి జాబితా ఇవ్వనుంది.





ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని కమిటీ చెప్పుకొచ్చింది. సర్వేలను కూడా పరిగణంలోకి తీసుకుంటామని, అయితే, సర్వేలు మాత్రమే ప్రామాణికం కాదని కమిటీ తెలిపింది. కాగా, ఎన్నికల కమిటీ ఏర్పాటయ్యాక జరిగిన మొదటి మీటింగ్ ఇదే కావడం విశేషం. 2018 ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చేవరకు.. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. దాంతో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ఆ పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ముందే టీ కాంగ్రెస్ ప్రక్రియ ప్రారంభించింది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు సంబంధించి వివాదం లేని 38 స్థానాల్లో.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని తొలి జాబితా విడుదల చేయనున్నారు.




Updated : 14 Aug 2023 8:44 PM IST
Tags:    
Next Story
Share it
Top