V Hanumantha rao:కేసీఆర్ జైలుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది.. కాంగ్రెస్ సీనియర్ నేత
X
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జైలుకెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్.. కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రోద్బలంతో అధికారులు తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలతో సంబంధాలు కోల్పోయారని, అందుకే ప్రజలు కూడా దూరం పెట్టారని అన్నారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలకు కూడా ఓపిక లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలైనా కాకముందే విమర్శలు మొదలుపెట్టారని అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలు, కల్లిబొల్లి కబుర్లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నల్గొండలో కాకపోతే మరెక్కడ సభ పెట్టుకున్నా తమకు ఎలాంటి భయం లేదని అన్నారు.