ఈ లీడర్లకు టికెట్లు వద్దట.. ఎందుకంటే..?
X
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలని అధిష్టానం నిర్ణయించి విషయం తెలిసింది. ఆగస్టు 18న మొదలైన దరఖాస్తు ప్రక్రియ నేటితో (ఆగస్ట్ 25) ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మంది ఆశావహులు కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం చివరి రోజు కావడంతో ఆశావహులు దరఖాస్తు చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు తరలి వచ్చారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ లీడర్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.
వీళ్లలో మాజీ మంత్రి జానారెడ్డి, సీనియర్ లీడర్లు గీతారెడ్డి, వి. హనుమంతరావు, రేణుకా చౌదరి, జి. నిరంజన్, కోదండ రెడ్డి, మల్లు రవి ఉన్నారు. కాగా, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, భట్టి విక్రమార్క మధిర నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, సీతక్క ములుగు, జీవన్ రెడ్డి జగిత్యాల, షబ్బీర్ అలీ కామారెడ్డి, కొండా సురేఖ వరంగల్ తూర్పు, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, శ్రీధర్ బాబు మంథని, జగ్గారెడ్డి సంగారెడ్డి, సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్, మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్, పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు.. సనత్ నగర్ నుంచి శశిధర్ రెడ్డి కుమారులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.