Home > తెలంగాణ > తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం పక్కా - రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం పక్కా - రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం పక్కా - రేవంత్ రెడ్డి
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. బెల్లంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.

దేశంలో గాంధీ కుటుంబం, తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులని రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లితో పాటు చెన్నూరులోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రంతో పాటు దేశమంతటా తెలుసని అన్నారు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారని, ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ధరణి కన్నా మెరుగైన టెక్నాలజీతో మరో పోర్టల్‌ తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి ఏటా రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తామని రేవంత్ ప్రకటించారు.

Updated : 11 Nov 2023 10:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top