Home > తెలంగాణ > రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు..

రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు..

రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో తొలి గెలుపును నమోదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 28,358 ఓట్ల తేడాతో గెలిపొందారు. అటు ఇల్లందులోనూ కాంగ్రెస్ జెండా ఎగరేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై కోరం కనకయ్య విజయం సాధించారు. దీంతో తొలి రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 65 స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated : 3 Dec 2023 12:00 PM IST
Tags:    
Next Story
Share it
Top