Home > తెలంగాణ > కొనసాగుతోన్న సీడబ్ల్యూసీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

కొనసాగుతోన్న సీడబ్ల్యూసీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

కొనసాగుతోన్న సీడబ్ల్యూసీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
X

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

ఇవాళ్టి సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్‌ పాలిత నాలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఆదివారం విస్తృతస్థాయి భేటీ జరగనుంది. రేపటి భేటీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత విషయాలపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత పొత్తులపై చర్చలు ఉంటాయన్నారు.

అంతకుముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 17మంది అనుచరులతో ఆయన హస్తం గూటికి చేరారు. కాగా ఇవాళ ఉదయమే తుమ్మల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పాలేరు టికెట్ ఆశించిన తుమ్మలకు బీఆర్ఎస్ బాస్ షాకిచ్చారు. ఆ టికెట్ను కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల.. ఇవాల ఉదయమే కారు పార్టీకి రాజీనామా చేశారు.


Updated : 16 Sep 2023 11:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top