Home > తెలంగాణ > CWC Meet : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి సర్వం సిద్ధం..

CWC Meet : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి సర్వం సిద్ధం..

CWC Meet : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి సర్వం సిద్ధం..
X

కాంగ్రెస్ కొత్త వర్కింగ్ కమిటీ (CWC) తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. శనివారం హైదరాబాద్‌లోని తా‌జ్‌​కృష్ణాలో ఈ భేటీ జరగనుంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ ఎలక్షన్స్ నేపథ్యంలో భవిష్యత్ వ్యూహం, ఇండియా కూటమిలో భాగస్వామ్యం తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు. రెండో విడత భారత్ జోడో యాత్రపైనా సీడబ్ల్యూసీలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

సెప్టెంబరు 17న విస్తృత వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులందరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

సీడబ్ల్యూసీ మీటింగ్లో భాగంగా తొలిరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్యం, తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు లోక్ సభ ఎలక్షన్స్ లేదా జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలన్న అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇక రెండో రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి, చైనా సరిహద్దులో ఉద్రిక్తత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంపై కూడా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఆగస్ట్ 20న ఏఐసీసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్నిర్మించింది. కార్యవర్గంలోకి 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులను సీడబ్ల్యూసీ లిస్టులో చేర్చారు. సచిన్ పైలట్, శశిథరూర్ తదితర నేతలకు తొలిసారి వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది.




Updated : 15 Sept 2023 6:35 PM IST
Tags:    
Next Story
Share it
Top