Home > తెలంగాణ > ఫలక్‌నుమా రైలు ప్రమాదం వెనుక కుట్ర ?..ఆ లేఖతో సంబంధముందా ?

ఫలక్‌నుమా రైలు ప్రమాదం వెనుక కుట్ర ?..ఆ లేఖతో సంబంధముందా ?

ఫలక్‌నుమా రైలు ప్రమాదం వెనుక కుట్ర ?..ఆ లేఖతో సంబంధముందా ?
X

యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా రైలు ప్రమాదం సంచలనం సృష్టిస్తోంది. రైలులో మంటలు చెలరేగి 5 బోగీలు దగ్థమయ్యాయి. ప్రయాణికులు సకాలంలో కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిన సుమారు నెలరోజుల్లో వ్యవధిలోనే మరో పెను రైలు ప్రమాదం జరడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.





ఫలక్‌నుమా రైలు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. వారం రోజుల కింద ఓ బెదిరింపు లేఖ రావడమే ఈ అనుమానాలకు కారణం. కొన్ని రోజుల క్రితం సౌత్‌ సెంట్రల్‌కు వచ్చిన బెదిరింపు లేఖ వచ్చింది. హైదరాబాద్‌, ఢిల్లీ రూట్‌లో బాలాసోర్‌ వంటి ప్రమాదం జరుగుతుందని ఓ అంగతకుడు లేఖలో హెచ్చరించారు. దీంతో లేఖకు దీనికి ఏమైనా లింక్‌ అందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. అయితే ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి ఆ లేఖకు ఎటువంటి సంబంధం రైల్వే జీఎం అరుణ్​కుమార్ లేదని కొట్టిపారేశారు. ఆ లేఖ ఎవరు రాసిన వారిని కనుక్కొనేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు వివరించారు.





యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం 11.25 నిమిషాలకు ఫలక్‌నుమా రైలు మంటలు అంటుకున్నాయి. మొదట రెండు బోగీల్లోంచి మంటలు రావడాన్ని గమనించి రైలుని నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

రైలు ప్రమాదానికి కారణమేంటి అనే దానిపై క్లారిటీ రావడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.


Updated : 7 July 2023 3:17 PM IST
Tags:    
Next Story
Share it
Top