Home > తెలంగాణ > తెలంగాణ సచివాలయం ముట్టడి.. ఉద్రిక్తతల మధ్య అరెస్టులు

తెలంగాణ సచివాలయం ముట్టడి.. ఉద్రిక్తతల మధ్య అరెస్టులు

తెలంగాణ సచివాలయం ముట్టడి.. ఉద్రిక్తతల మధ్య అరెస్టులు
X

తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దాదాపు 50 మంది కానిస్టేబుల అభ్యర్థులు సచివాలయం ముట్టడికి యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. గేటు వద్దూ బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత పద్దతిలోనే నియామకాలు చేపట్టాలని. మెరిట్ ఆధారంగా పోస్టుల భర్తీ చేయాలని కోరుతున్నారు. జీవో 46 వల్ల కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు నాన్ లోకల్ గా మారే అవకాశం ఉందని, దాని వల్ల నియామకల్లా అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆందోళనకు దిగారు.

Updated : 26 July 2023 4:43 PM IST
Tags:    
Next Story
Share it
Top