దారుణం.. సీఐ మర్మాంగాన్ని కోసేసిన కానిస్టేబుల్.. కారణమదే..
X
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్.. సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి తోటి కానిస్టేబుల్ సైతం సాయం చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్.. తన భార్య శకుంతలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనేది కానిస్టేబుల్ జగదీష్ ఆరోపణ. ఈ క్రమంలోనే అతను సీఐపై దాడికి తెగబడ్డాడు. తోటి కానిస్టేబుల్‌తో కలసి సీఐపై దాడికి దిగి, అతని మర్మాంగాలను కోసి, గాయపరిచాడు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది.