Home > తెలంగాణ > ఇందిరాపార్క్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా

ఇందిరాపార్క్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా

ఇందిరాపార్క్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా
X

కానిస్టేబుల్ అభ్యర్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పును కాంగ్రెస్ సర్కారు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. గత హోం మంత్రికి జీవో 46పై అవగాహన లేకపోవడం, నియామక బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 46ను రద్దుచేసి న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. ఆ జీవో కారణంగా తెలంగాణలోని యువకులు స్థానికేతరులుగా మారి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. తమ సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated : 23 Dec 2023 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top