విద్యార్థులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు
X
తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు మండిపడ్డారు. తమను రెగ్యులరైజ్ చేయాలని గత మూడు నెలలుగా డిమాండ్ చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నిరకాలుగా విజ్ఞప్తులు చేసినా..నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. సోమవారం (ఆగస్టు 14) జరిగిన కాంట్రాక్ట్ లెక్ఛరర్ల జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం అయింది. ఈ చర్చల్లో ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించారు. బంద్ ను విజయవంతం చేయాలని, అన్ని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు మద్దతు తెలుపాలని కోరారు. దానితో పాటు ఆగస్టు 19, 20 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాదీక్ష చేపడతామని ప్రకటించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే.. తమ కుటుంబాలతో సహా దీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.