Home > తెలంగాణ > GHMC Contractors Protest : పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన

GHMC Contractors Protest : పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన

GHMC Contractors Protest : పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన
X

పెండింగ్‌లో ఉన్న రూ.1200 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల డిమాండ్ చేశారు. ఈ మేరకు బిల్లులు మంజూరు చేయాలని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రస్ సర్కార్ అయిన తమ బాధను పట్టించుకోని తమకి న్యాయం చేయాలని కోరారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు చెల్లించలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటివరకు తమ బిల్లులు వేల కోట్లలో పేరుకుపోయాయని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు తాము చేపట్టిన పనులకు సైతం ఇంకా బిల్లులు చెల్లించలేదని, తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోయారు.

బిల్లులు చెల్లించని పక్షంలో ఎక్కడి పనులు అక్కడనే నిలిపివేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం జీహెచ్ఎంసీలో గుత్తేదారు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. మూడేళ్ల కిందట 5 నుంచి 6 వేల మంది ఉన్న కాంట్రాక్టర్ల సంఖ్య, చెల్లింపుల సమస్య, పనులపై ఆంక్షల వల్ల 2 నుంచి 3 వేలకు తగ్గిందని చెబుతున్నారు. ఫలితంగా ప్రజలకు కావాల్సిన పనులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇది పూర్తిగా అభివృద్ధిని అడ్డుకోవడమేని గుత్తేదారులు అభిప్రాయపడుతున్నారు.పెండింగ్ బిల్లుల నిధుల విడుదలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన పనులపై తనిఖీ చేసిన తర్వాతే బిల్లులు విడుదల చేయాలనే ఆదేశాలు ఆర్థిక శాఖకు అందినట్లు సమాచారం. కేవలం ఉద్యోగుల జీతాలు మినహా మిగతా బిల్లులను ఆర్థిక విభాగం తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు వినిపిస్తోంది. ఇప్పటివరకు శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలను మరోసారి అధికారుల నుంచి సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే జీహెచ్ఎంసీపై ప్రత్యేకంగా సమీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 19 Feb 2024 10:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top