Telangana : తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి.. కేటీఆర్ ట్వీట్..
X
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంతో గొరిల్లా గ్లాస్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో అగ్రిమెంట్ కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న కార్నింగ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానికి డివైజ్ల కోసం గొరిల్లా గ్లాస్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ లో రాశారు. ఈ కంపెనీ రాకతో రాష్ట్రంలో 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ చెప్పారు.
Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊
— KTR (@KTRBRS) September 1, 2023
Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl