ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్
X
తెలంగాణ సహ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య కౌంటింగ్ చేపట్టారు అధికారులు. రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 13 స్థానాల్లో బీజేపీ, 9 సీట్లలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 2 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 11 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఒ స్థానంలో లీడింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 116చోట్ల గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తి మారింది. ఇక్కడ కాంగ్రెస్ అవలీలగా 46 సీట్ల మెజారిటీ మార్కును అందుకుని రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రతిసారి అధికారాన్ని మార్చే... సంప్రదాయం ఉన్న రాజస్థాన్‌లో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఈసారి విపక్ష భాజపా అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్‌లో 200 స్థానాలు ఉండగా ఓ అభ్యర్థి మరణంతో 199 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిస్థితిలో వంద సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.