Home > తెలంగాణ > ఆమ్లేట్ కోసం గొడవ.. ఐదుగురికి జైలుశిక్ష.. జరిమానా

ఆమ్లేట్ కోసం గొడవ.. ఐదుగురికి జైలుశిక్ష.. జరిమానా

ఆమ్లేట్ కోసం గొడవ.. ఐదుగురికి జైలుశిక్ష.. జరిమానా
X

ఆమ్లేట్ కోసం ఓ వ్యక్తిని చితకబాదిన మిత్రబృందం.. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినేందుకు సిద్ధమైంది. వైన్ షాప్‌లో లిక్కర్ తాగుతూ స్టఫ్ కోసం చేసిన హంగామా వల్ల ఐదుగురు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఓల్డ్ బోయినపల్లికి చెందిన వీరకుమార్, అనిల్, వాజిద్, శ్రీకాంత్, మహేష్ అనే ఐదుగురు స్నేహితులు.. మద్యం సేవించేందుకు బోయినపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఒక వైన్ షాపుకు వెళ్లారు. ఆ షాపులోని పర్మిట్ రూమ్‌లో కూర్చోని ఐదుగురు మద్యం తాగుతూ.. ఓ ఆమ్లేట్ ఆర్డర్ ఇచ్చారు.




అయితే అదే సమయంలో తిరుమలగిరికి చెందిన బాలు తన స్నేహితుడైన కుమార్ అనే యువకుడితో కలిసి అదే పర్మిట్ రూమ్‌కు వచ్చాడు. వీళ్లు కూడా మద్యం తాగుతూ రెండు ఆమ్లేట్‌లు ఆర్డర్ ఇచ్చారు. ఈ సమయంలో ఈ రెండు వర్గాలు.. తమకే ముందు ఆమ్లేట్ ఇవ్వాలని పట్టుబట్టాయి. ఆ స్టఫ్ కోసమే రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రెచ్చిపోయిన ఆ ఐదుగురు మిత్రుల వర్గం.. బాలుపై దాడికి దిగింది. బాలుని విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో బాలుకు తీవ్ర గాయలవ్వగా.. దాడి విషయంపై బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.

వైన్ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరుపరచి.. దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్‌ను కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో యువకుడిపై దాడి చేసి గాయపర్చినందుకు ఐదుగురు నిందితులకు 3 రోజుల జైలుశిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఐదుగురు యువకులను జైలుకు పోలీసులు తరలించారు.




Updated : 7 July 2023 4:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top