Home > తెలంగాణ > కేసీఆర్ ఇచ్చే సీట్లు వెంట్రుకతో సమానం.. సీపీఐ నారాయణ అక్కసు..

కేసీఆర్ ఇచ్చే సీట్లు వెంట్రుకతో సమానం.. సీపీఐ నారాయణ అక్కసు..

కేసీఆర్ ఇచ్చే సీట్లు వెంట్రుకతో సమానం.. సీపీఐ నారాయణ అక్కసు..
X

బీఆర్‌ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తు కోసం తహతహలాడి శృంగభంగమైన కమ్యూనిస్టులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. సీపీఐ, సీపీఎంలకు చెరొక సీటు ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, ఆ పార్టీలు చెరో మూడు సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో పొత్తు చర్చలు విఫలం కావడం తెలిసిందే. కేసీఆర్ 115 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంతో రెండు ఎర్ర పార్టీలు భగ్గుమంటున్నాయి. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో తమను వాడుకుని మోసం చేశారని మండిపడుతున్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తమకు విదిల్చే సీట్లు వెంట్రుకతో సమానం అని అన్నారు.

ఆయన పార్టీ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ తమ పార్టీ సన్యాసుల పార్టీ కాదని అన్నారు. కేసీఆర్ తన ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతిస్తున్నారని, మద్యం కుంభకోణంలో తన కూతురిని కాపాడుకుంటున్నారని అన్నారు. ‘‘బీఆర్ఎస్, ఎంఐఎం ఇప్పుడు బీజేపీ వత్తాసు పలుకుతున్నాయి. మోదీకి వ్యతిరేకంగా పోరాడాలన్నది మా విధానం. కాంగ్రెస్‌ మాతో చేతులు కలిపిస్తే కలసి పనిచేస్తాం. కలిసి రాకపోయినా ఫర్వాలేదు మాకు బలమున్న 20 స్థానాల్లో తలపడతాం. జాతీయ స్థాయిలో ఒక రకం పొత్తులు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో మరో రకం పొత్తులు ఉంటాయి’’ అని అన్నారు. ఎంఐఎం అవినీతి పార్టీ అని, మజ్లిస్ నేతల ఇళ్లపై దాడులు చేస్తే కోట్ల సొమ్ము బయటపడుతుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చంద్రయాన్ సహా ప్రతి అంశానికీ మతం రంగు పులుముతున్నారని, ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


Updated : 3 Sept 2023 7:23 PM IST
Tags:    
Next Story
Share it
Top