Home > తెలంగాణ > కాంగ్రెస్తో పొత్తు.. సీపీఐ కీలక నిర్ణయం..

కాంగ్రెస్తో పొత్తు.. సీపీఐ కీలక నిర్ణయం..

కాంగ్రెస్తో పొత్తు.. సీపీఐ కీలక నిర్ణయం..
X

తెలంగాణలో పొత్తు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్తో పెట్టుకోవాలని సీపీఐ, సీపీఎం భావించగా.. గులాబీ బాస్ వారికి షాకిచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తు కోసం చర్చలు సాగించాయి. కానీ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. అడిగిన చోట సీట్లు ఇచ్చేందుక కాంగ్రెస్ నిరాకరించడంతో.. ఇప్పటికే సీపీఎం పొత్తుకు గుడ్ బై చెప్పింది. అంతేకాకుండా 24స్థానాల్లో పోటీ చేస్తామంటూ అందులో 17చోట్ల అభ్యర్థులను సైతం ప్రకటించింది.

ఈ క్రమంలో ఇవాళ సీపీఐ రాష్ట్ర కమిటీ భేటీ అయ్యింది. సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో.. తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ తీర్మానం చేసింది. పాత ప్రతిపాదనలనే కాంగ్రెస్ ముందు పెట్టామని.. పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర కమిటీకి తీర్మానం పంపామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. త్వరలోనే కీలక ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.


Updated : 3 Nov 2023 9:35 PM IST
Tags:    
Next Story
Share it
Top