Home > తెలంగాణ > కాలం కలిసొస్తే బీఆర్ఎస్తో పొత్తు.. లేదంటే ఉమ్మడిగా పోటీ చేస్తం

కాలం కలిసొస్తే బీఆర్ఎస్తో పొత్తు.. లేదంటే ఉమ్మడిగా పోటీ చేస్తం

కాలం కలిసొస్తే బీఆర్ఎస్తో పొత్తు.. లేదంటే ఉమ్మడిగా పోటీ చేస్తం
X

బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులరిజాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమని.. కమ్యూనిస్టు నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులకు పడట్లేదని, కాంగ్రసె తో కలిసిపోయారనే వస్తున్న వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు. మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు.. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కమ్యూనిస్ట్ లతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. అయితే, కేసీఆర్ తమతో సీట్ల కేటాయింపు విషయం గురించి ఇంకా చర్చించలేదని, అలాగని వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదన్నారు. తమ సీట్లకు ఎసరు వస్తుందని కొంతమంది ఎమ్మెల్యేలు మైండ్ గేమ్ ఆడుతూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం (జూన్ 30) సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ అనంతరం నేతలు.. కీలక వ్యాఖ్యలు చేశారు.





బీఆర్ఎస్ తో స్నేహం కొనసాగుతుందని, అయితే పొత్తుల కోసం వెంపర్లాడబోమని తెలిపారు. కేసీఆర్ పిలిచినప్పుడే వెళ్తామని స్పష్టం చేశారు. తమకు బలం ఉన్న ప్రతి చోట ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు.. సీపీఎం, సీపీఐ ఎప్పటికీ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు.

Updated : 30 Jun 2023 6:54 PM IST
Tags:    
Next Story
Share it
Top