Home > తెలంగాణ > రాచకొండ కమిషనరేట్‌ వార్షిక నేర నివేదిక రిలీజ్

రాచకొండ కమిషనరేట్‌ వార్షిక నేర నివేదిక రిలీజ్

రాచకొండ కమిషనరేట్‌ వార్షిక నేర నివేదిక రిలీజ్
X

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయని సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో 2023లో నేరాలు 6.86 శాతం పెరిగాయని చెప్పారు. సైబర్ నేరాలు 25శాతం పెరిగాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 2,562 సైబర్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే మహిళలపై నేరాలు మాత్రం 6.65 శాతం తగ్గాయని సీపీ ప్రకటించారు.

ఈ ఏడాది మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదుకాగా.. 972 మంది అరెస్ట్ అయినట్లు చెప్పారు. డ్రగ్స్ కు సంబంధించి 282 కేసుల్లో 698 మంది అరెస్టుకాగా వారిలో 12 మందిపై పీడీ యాక్ట్‌ నమోదుచేశామని అన్నారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయిందని, కన్విక్షన్ రేట్ 62 శాతం పెరిగిందని చెప్పారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని సీపీ స్పష్టం చేశారు.

Updated : 27 Dec 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top