కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు
X
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్‌రావు నిన్న వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారా హిల్స్ పీఎస్‌కు పంపాగా ఐ పీ సీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు..2,500 కోట్లు వసూలుచేసి అధిష్ఠానానికి పంపారని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదన్నారు. సామంత రాజులా రేవంత్ ఢిల్లీకి రూ.2500 కోట్లు కప్పం కట్టారని ఆరోపించారు. దీనికోసం ఆయన అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.