Hyderabad: సన్‌బర్న్‌కు అనుమతి ఇవ్వలేదు... సీపీ అవినాశ్
X
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో సన్‌బర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించ తలపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయిస్తున్నారు. అయితే ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఈవెంట్‌పై దుమారం రేగడంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి స్పందించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి వెల్లడించారు.
మరోవైపు ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.