Home > తెలంగాణ > సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం..

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం..

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం..
X

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. స్టీఫెన్ రవీంద్ర తండ్రి, మాజీ పోలీస్ అధికారి రంజిత్ బుధవారం రాత్రి కన్నుమూశారు. పోలీస్ శాఖలో సీపీ తండ్రి రంజిత్ వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన రంజిత్.. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా.. రంజిత్ మృతి పట్ల తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

తాను గుంటూరు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. రంజిత్‌తో కలిసి పని చేసే అనుభవం తనకు దొరికిందని డీజీపీ అంజనీ కుమార్ గుర్తు చేసుకున్నారు. 1998 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. రంజిత్ నిర్వర్తించిన పాత్ర ఇప్పటికీ తనకు గుర్తుందని పేర్కొన్నారు. ఆ దేవుడు రంజిత్ కుటుంబానికి స్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాని వివరించారు అంజనీ కుమార్.




Updated : 26 Oct 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top