Home > తెలంగాణ > ఎన్నికల వేళ పోలీసులకు హ్యాకర్ల వార్నింగ్

ఎన్నికల వేళ పోలీసులకు హ్యాకర్ల వార్నింగ్

ఎన్నికల వేళ పోలీసులకు హ్యాకర్ల వార్నింగ్
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గపడుతున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా డీసీపీ ఫోన్ నే 2 గంటల పాటు హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్ కోడ్ వల్ల పోలీసులు నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఇలాంటి టైంలో డీసీపీ ఫోన్ హ్యాక్ అవ్వడం కలకలం రేపుతుంది. శనివారం ఫోన్ హ్యాక్ అయినట్లు డీసీపీ గుర్తించారు. దాదాపు 2 గంటల పాటు తన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు నిర్థారించారు. ఫోన్ హ్యాక్ అయిన సమయంలో ఫోన్ నుండి కొన్ని వింత వింత శబ్దాలు, నోటిఫికెషన్స్ వచ్చినట్లు డీసీపీ తెలిపారు.

ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావడానికి సైబర్ నిపుణులు చాలా కష్టపడ్డారని డీసీపీ వెల్లడించారు. డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ అవడాన్ని పోలీస్ అధికారులు తీవ్రంగా పరిగణంలోకి తీసుకున్నారు. అయితే నగరంలోని ఓ ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ ఇటీవల చేయిచేసుకున్నాడు. దాంతో ఆ ఐటీ ఉద్యోగి మరికొందరి సాయంతో డీసీపీ ఫోన్ హ్యాక్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫోన్ లోని డీసీపీ వ్యక్తిగత వీడియోలు బయటపెట్టి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇతర పోలీసుల సమాచారాన్ని కూడా వెలికి తీస్తామని.. హ్యాకర్లు తమ పోస్ట్ ల ద్వారా హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు.




Updated : 15 Oct 2023 1:30 PM IST
Tags:    
Next Story
Share it
Top