Home > తెలంగాణ > ప్రయాణికులకు అలర్ట్..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రయాణికులకు అలర్ట్..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రయాణికులకు అలర్ట్..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
X

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఫారెస్ట్ డిపార్ట్‎మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫారెస్టు ట్రెక్‌ పార్క్ ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ ట్రెక పార్క్‏ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. దీనితో పాటుగానే హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను శుక్రవారం మంత్రి సబితారెడ్డి పరిశీలించారు.





ఫారెస్టు ట్రెక్‌ పార్క్ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంచిరేవులలో ఇవాళ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం, మంత్రి సబితా రెడ్డితో పాటు ఎమ్మెల్యే యాదయ్య, ఫారెస్ట్ డెవలప్‎మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సీఎంవో సెక్రటరీ భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో టీఎస్‌పీఏ నుంచి మంచిరేవుల మీదుగా నార్సింగి వరకు ఓఆర్‌ఆర్‌ సర్విస్‌ రోడ్డులో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ తెలిపారు.




Updated : 26 Aug 2023 9:52 AM IST
Tags:    
Next Story
Share it
Top