Home > తెలంగాణ > సీఎస్ శాంతికుమారి పేరుతో 'సైబర్' మోసం

సీఎస్ శాంతికుమారి పేరుతో 'సైబర్' మోసం

సీఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ మోసం
X

రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల కష్టార్జితాన్ని కొల్లగొడుతూ .. రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు. నిరక్షరాస్యులతో పాటు ఉద్యోగులు, ఉన్నతాధికారులను సైతం ఉచ్చులోకి దింపి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల పేర్లను సైతం వాడుకోవడానికి ఏమాత్రం వెనుకడడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో పలువురు ఉద్యోగులను... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి పేరుతో సెల్ ఫోన్ లో చాటింగ్ చేశారు. వాట్సాప్ కాల్స్ కూడా చేశారు. చాటింగ్‌లలోనే తమ బ్యాంకు ఖాతాకు డబ్బులను పంపాలని కోరారు. సీఎస్ స్థాయి అధికారి తమను ఎందుకు డబ్బులు అడుగుతారని అనుమానించిన కొందరు ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈలోపే తొలుత ఉద్యోగుల క్షేమ సమాచారం గురించి తెలుసుకుంటూ.. మీ చిట్టా నా వద్ద ఉందంటూ కొంతమంది వద్ద డబ్బులు దండుకున్నారు కూడా . ప్యూటీ తహసీల్దార్ ఒకరు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ. 2 లక్షలు పంపారు.





15 రోజుల క్రిందట కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న పలు విభాగాల ఉన్నతాధికారులకు అవినీతి నిరోధక శాఖ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీరు ఎంతో కొంత నగదును ముట్ట చెప్పి సర్దుబాటు చేసుకోవాలని లేకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా భావించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇలాంటి బెదిరింపులు రాష్ట్రమంతా జరుగుతున్నట్లుగా నిర్ధారించారు. ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సైతం సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.












Updated : 5 July 2023 7:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top