Home > తెలంగాణ > ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
X

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రేపటికి తీవ్రవాయుగుండంగా మారి ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం నుంచి ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. డిసెంబర్ 5 తర్వాత చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుఫాన్ ఉత్తర తమిళనాడు ప్రాంతానికి దగ్గర వచ్చినప్పుడు డెల్టా, చెన్నై ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


Updated : 1 Dec 2023 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top