Home > తెలంగాణ > TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. మరోసారి..

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. మరోసారి..

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. మరోసారి..
X

ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలన్నింటినీ (డీఏ) మంజూరు చేసినట్లు.. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. ఈ ఏడాది జులై నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉన్న 4.8 శాతం డీఏను కూడా మంజూరు చేశారు. అక్టోబర్ నెల జీతంతో కలిపి ఈ డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నారు. టీఎస్ఆర్టీసీ 2019 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో ఆర్టీసీ అన్ని డీఏలను ఉద్యోగులను చెల్లించింది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తున్నారని సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి టీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు.




Updated : 4 Oct 2023 5:59 PM IST
Tags:    
Next Story
Share it
Top