Home > తెలంగాణ > PM Modi : కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం..ప్రధాని మోదీ

PM Modi : కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం..ప్రధాని మోదీ

PM Modi : కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం..ప్రధాని మోదీ
X

తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధి కోసం వేల కోట్ల ప్రాజెక్టులు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా రైతులకు పీఎం సమ్మాన్ స్మీమ్ అందుతుందన్నారు.

బీజేపీ పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది మహిళలేనని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే అని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య అవినీతి బంధం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఏంలా మార్చుకుందని అన్నారు. ఈ మేరకు పటాన్ చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. ఆర్టికల్ 370 మీద ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. రామమందిరం కడతామన్నాం కట్టి చూపించామని తేల్చి చెప్పారు. విదేశాల్లో తెలుగువాళ్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. మోదీ గ్యారెంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారెంటీనే అని అన్నారు. ఆర్థిక రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని చెప్పారు. కోట్ల రూపాయాల అవినీతి సొమ్మును వెనక్కి రప్పించామన్నారు. తాను ఎవరిపైనా వ్వక్తిగత విమర్శలు చేయలేదని..కాంగ్రెస్ నేతలే తనను విమర్శిస్తున్నారన్నారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబపాలన వాళ్ల కుటుంబాలే లాభపడ్డాయని తేల్చి చెప్పారు.

కుటుంబ పాలన రాష్ట్రాలకు నష్టం చేస్తుందని స్పష్టం చేశారు. వేల కోట్ల అవినీతి బయట పెడుతున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని కొల్లగొట్టి వాళ్ల కుటుంబాలకు లాభం చేకూర్చుకున్నారని ఆరోపించారు. వాళ్ల రాజకీయాలకు కుటుంబాలు బాగుపడ్డాయి కానీ..ప్రజల జీవితాలు బాగుపడలేదని అన్నారు. కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని సూచించారు. కొందరికి కుటుంబం ముఖ్యమైతే..తనకు మాత్రం దేశం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు.




Updated : 5 March 2024 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top