Home > తెలంగాణ > మరో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. తీవ్ర విషాదంలో స్టూడెంట్స్.. అసలేం జరిగింది..?

మరో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. తీవ్ర విషాదంలో స్టూడెంట్స్.. అసలేం జరిగింది..?

మరో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. తీవ్ర విషాదంలో స్టూడెంట్స్.. అసలేం జరిగింది..?
X

మరో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని బలవాన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొమరబండ గ్రామానికి చెందిన దార సురేష్ (30) డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన సురేష్.. పెళ్లి కావట్లేదని బెంగ పెట్టుకున్నాడు. దాంతో జీవితంపై విరక్తి పుట్టి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

శుక్రవారం (జులై 14) సురేష్ ఫ్రెండ్స్ ఇంటికి రాగా.. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం పడ్డారు. తర్వాత కిటికీలోంచి చూడగా.. ఫ్యాన్స్ కు వేళాడుతూ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. సురేష్ ను కిందికి దించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి.. కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు. తర్వాత సురేష్ తమ్ముడు బొబ్బిలి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 15 July 2023 9:26 AM IST
Tags:    
Next Story
Share it
Top